IND vs WI | రోసౌ(డొమినికా): వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. తొలుత టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకోగా, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న టీమ్ఇండియా వికెట్ల వేట ప్రారంభించింది. పేస్ బౌలింగ్‌కు అంతగా సహకరించని చోట స్పిన్నర్లు తమదైన ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ (4/49), జడేజా (2/24) ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో టీ విరామ సమయానికి 8 వికెట్లుకోల్పోయి 137 పరుగులు చేసింది.
అరంగేట్రం టెస్టు ఆడుతున్న అలిక్ అతనజె (47) టాప్ స్కోరర్ కాగా, బాహుబలి రహీమ్ కార్న్‌వాల్ (8), రోచ్ (0)క్రీజులో ఉన్నారు. విండీస్‌ను అశ్విన్ ఆదిలోనే ఎదురుదెబ్బ తీశాడు. తన స్పిన్ మాయాజాలంతో ఏడు పరుగుల తేడాతో ఓపెనర్లు తేజ్‌నరైన్ చంద్రపాల్ (12), క్రేగ్ బ్రాత్‌వైట్ (20)ను పెవిలియన్ పంపి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. ఇక్కణ్నుంచి విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. రీఫర్(2), బ్లాక్‌వుడ్ (14), డిసిల్వా (2), హోల్డర్ (18) తీవ్రంగా నిరాశపరిచారు. అశ్విన్‌కు తోడు మరో ఎండ్‌లో జడేజా చెలరేగడంతో విండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆడుతున్నది తొలి టెస్టు అయినా అలిక్ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
అభిషేక్‌కు కాంస్యం