T20 World Cup | నార్త్‌సౌండ్(అంటిగ్వా): టీ20 ప్రపంచకప్ వేటలో భారత్ టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నది. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌తో మొదలుపెట్టి అఫ్గానిస్థాన్‌తో సూపర్-8 పోరు వరకు అపజయమెరుగని టీమ్ఇండియా.. అదే జోరులో బంగ్లాదేశ్‌ను చిత్తుచేయాలని చూస్తున్నది. మెగాటోర్నీల్లో బంగ్లాపై మెరుగైన రికార్డు ఉన్న భారత్ అదే పంథాను కొనసాగిస్తూ సెమీఫైనల్ బెర్తు దక్కించుకోవాలన్న పట్టుదలతో రోహిత్‌సేన కనిపిస్తున్నది. ప్రస్తుత ప్రపంచకప్‌లో టాపార్డర్ వైఫల్యం భారత్‌ను కలవరపెడుతున్నది. ముఖ్యంగా రోకో(రోహిత్-కోహ్లీ) జోడీ వైఫల్యం శుభారంభాలను అందించలేకపోతున్నది. ఐపీఎల్లో పరుగుల వరద పారించిన కోహ్లీ ప్రపంచకప్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు.
రోహిత్ జతగా ఓపెనర్‌గా వస్తున్న కోహ్లీ బ్యాటు ఝలిపించలేకపోతున్నాడు. మిడిలార్డర్లో రిషబ్ పంత్, సూర్యకుమార్‌యాదవ్ టచ్‌లో ఉండటం భారత్‌కు కలిసి వస్తున్నది. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన శివమ్ దూబే ఆకట్టుకోలేకపోతున్నాడు. బౌలింగ్ విషయానికొస్తే..అఫ్గన్‌తో పోరులో బరిలోకి దిగిన బౌలర్లనే తిరిగి కొనసాగించే అవకాశముంది. మరోవైపు టోర్నీలో బంగ్లా ప్రస్థానం పడుతూలేస్తూ సాగుతున్నది. ఆసీస్ చేతిలో ఓటమిపాలైన బంగ్లా..భారత్‌కు పోటీనివ్వాలని చూస్తున్నది. ముస్తాఫిజుర్ రెహమన్, రిషాద్ హుస్సేన్ ఫామ్మీదుండటం వారికి కలిసిరానుంది.
భారత్: రోహిత్(కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్‌దీప్, బుమ్రా.
బంగ్లాదేశ్: నజ్ముల్(కెప్టెన్), తంజిద్, లిటన్‌దాస్, తౌహిద్, షకీబ్, మహ్మదుల్లా, మెహదీహసన్, రిషాద్, తస్కిన్, తంజిమ్, ముస్తాఫిజుర్