దుబాయ్: షార్జాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో.. ఇండియానే హాట్ ఫెవరేట్‌గా ఉన్నట్లు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తెలిపారు. వరల్డ్ కప్ వార్మప్ మ్యాచుల్లో ఇండియా సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ వార్మప్ మ్యాచుల్లో ఇండియా ఆడిన తీరు అద్భుతంగా ఉందని, వరల్డ్‌కప్‌ను గెలిచేందుకు ఇండియానే హాట్ ఫెవరేట్‌గా ఉన్నట్లు వాన్ తన ట్విట్టర్లో తెలిపాడు. సోమవారం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో.. ఇంగ్లండ్‌పై ఇండియా ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఆ తర్వాత బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఈ ఆదివారం పాకిస్థాన్‌తో ఆడనున్నది.