బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్‌లో బెర్తులు నిర్ణయించే ప్రపంచ బాక్సింగ్ క్వాలిఫయర్స్‌లో సోమవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మహిళల 60 కిలోల విభాగంలో అస్సోం యువ సంచలనం అంకుశిత బొరో 4-1 తేడాతో నమున్ మొంఖోర్ (మంగోలియా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
ఆది నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్‌లతో విరుచుకుపడ్డ అంకుశిత తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. పురుషుల 80 కిలోల విభాగంలో పోటీపడ్డ అభిమన్యు లోరాకు నిరాశే ఎదురైంది.