గువహతి: స్వదేశంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియనన్షిప్స్లో భారత్ శుభారంభం చేసింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్‌గా సాగుతున్న ఈ టోర్నీలో గ్రూప్ హెచ్లో ఉన్న భారత్.. 45-18, 45-17తో నేపాల్‌ను చిత్తుగా ఓడించి బోణీ కొట్టింది. బెస్టాఫ్ త్రీ ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లో మన షట్లర్ల దూకుడుకు నేపాల్ కుదేలైంది. బాయ్స్ డబుల్స్‌లో భార్గవ్ రామ్-విశ్వ తేజ ద్వయం 9-3తో కబీర్-సుప్రిమ్ జోడీని ఓడించింది.
గర్ల్స్ విభాగంలో ఆసియా అండర్-19 చాంపియన్‌షిప్స్ కాంస్య విజేత తన్వి శర్మతో పాటు యువ సంచలనం ఉన్నతి హుడా తమ ప్రత్యర్థులను చిత్తుచేశారు. బాయ్స్ సింగిల్స్‌లో సూర్యాన్ష్, రౌనక్ సైతం పెద్దగా కష్టపడకుండానే గెలిచేశారు. కాగా ఇదే గ్రూప్‌లో శ్రీలం క.. 30-45, 45-34, 45-44తో యూఏఈకి షాకిచ్చింది. ఫ్రాన్స్, యూఎస్ఏ, చైనా, టర్కీ, ఇండోనేషియా సైతం తమ ఆరంభ రౌండ్లలో విజయాలు సాధించాయి.