వెవ్రె (బెల్జియం) : హాకీ ప్రపంచకప్‌లో సెమీస్ చేరడంలో విఫలమైన భారత హాకీ జట్టు వర్గీకరణ మ్యాచ్‌లో పోరాడి ఓడింది. ఏడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్.. బెల్జియం చేతిలో ఓడి 8వ స్థానంతో టోర్నీని ముగించింది. పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్‌లో భారత్.. 3-4 (3-3)తో బెల్జియంకు తలొంచింది. తొలి క్వార్టర్ ఆరో నిమిషంలోనే అభిషేక్ గోల్ బోణీ కొట్టినా రెండో క్వార్టర్లో బెల్జియం తరఫున రొమెన్ డువెకొట్ (22వ నిమిషంలో), ఆ మరుసటి నిమిషమే హ్యుగో లబోచెరె గోల్‌తో బెల్జియం 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
కానీ రెండో అర్ధం ఆరంభమయ్యాకే హర్మన్‌ప్రీత్ గోల్‌తో స్కోర్లు సమమయ్యాయి. అయితే నాలుగో క్వార్టర్లో మొదలయ్యాక నికోలస్ గోల్ కొట్టాడు. ఆట మరో 30 సెకన్లలో ముగుస్తుందనగా భారత్‌కు దొరికిన పెనాల్టీని హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలిచి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. షూటౌట్లో భారత్.. 3 గోల్స్ చేయగా బెల్జియం నాలుగు గోల్స్ కొట్టింది.