గువహతి: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో గువహతి వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ హెచ్లో ఉన్న భారత్.. ఈ దశలో ఓటమన్నదే లేకుండా నాకౌట్ దశకు చేరింది. బుధవారం జరిగిన గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‌లో 45-37, 45-34తో యూఏఈపై గెలిచింది. క్వార్టర్స్‌లో భారత జట్టు కొరియాతో తలపడనుంది.