బెనోని: త్వరలో మొదలుకాబోయే ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు దుమ్మురేపింది. హైదరాబాద్ యువ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (106 బంతుల్లో 118, 16 ఫోర్లు)తో పాటు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (74 బంతుల్లో 127, 9 ఫోర్లు, 10 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదం తొక్కడంతో భారత అండర్-19 జట్టు 393/7 పరుగుల భారీ స్కోరుచేసింది.
తొలి వికెట్‌కు ఆరోన్, వైభవ్ 25.4 ఓవర్లలోనే ఏకంగా 227 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదుచేసి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 35 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలి 233 పరుగుల తేడాతో భారీ ఓటమితో పాటు వైట్‌వాష్‌ను మూటగట్టుకుంది. భారత బౌలర్లలో కిషన్ కుమార్ (3/15), ఇనాన్ (2/36) రాణించారు.