లిమా: షూటింగ్ జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ దుమ్మురేపింది. 13 స్వర్ణాలు సహా 11 రజతాలు, ఆరు కాంస్య పతకాలతో మెగాటోర్నీలో భారత షూటర్లు టాప్లేపారు. అమెరికా ఆరు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలతో రెండో స్థానానికి పరిమితమైంది. పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో అనీశ్ భన్వాల, ఆదర్శ్ సింగ్, విజయ్వీర్సిద్ధు స్వర్ణ పతకం కొల్లగొట్టింది. బాలికల జూనియర్ డబుల్ ట్రాప్ ఈవెంటులో మాన్వి సోని పసిడి పతకం గెలువగా, హితాశ కాంస్యం సొంతం చేసుకుంది. పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంటులో వినయ్ ప్రతాప్సింగ్ స్వర్ణంతో మెరువగా సెహజ్ప్రీత్సింగ్, మయాంక్ షోకిన్కు వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.