కైరో: ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో వంశిక చౌదరి, చిరాగ్శర్మ ద్వయం పసిడి పతకంతో మెరిసింది.
ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో వంశిక, చిరాగ్ జోడీ 484.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. ఇదే విభాగంలో భారత్కు చెందిన మోహిని సింగ్, హిమాంశు రానా ద్వయం 407.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం ఖాతాలో వేసుకుంది.