Anmol Mazumdar : ప్రపంచ కప్ కోసం 47 ఏళ్లుగా నిరీక్షిస్తున్న భారత మహిళల జట్టు కలను సాకారం చేశాడు కోచ్ అన్మోల్ మజుందార్ (Anmol Mazumdar). క్రికెటర్‌గా పెద్ద రికార్డులేమీ సాధించని అతడు హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) బృందాన్ని ఛాంపియన్లుగా మలిచిన తీరును వేనోళ్ల కొనియాడుతున్నారు క్రీడా ప్రముఖులు. దశాబ్దాలుగా అందకుండా ఊరిస్తున్న మెగా ట్రోఫీని పట్టేయడంలో కీలకమైన మజుందార్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భారత జట్టు గొప్ప కోచ్‌లలో ఒకడిగా ఆయన పేరు దేశమంతా మార్మోగిపోతోంది. ఆయన కంటపడితే చాలు అభినందనల్లో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్. మహిళల జట్టు చరిత్ర సృష్టించడంలో కీలకమైన మజుందార్‌కు అతడి నివాసం వద్ద ఘన స్వాగతం లభించింది.
హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని టీమిండియాను వరల్డ్ కప్ ముద్దాడేలా చేసిన కోచ్ మజుందార్‌కు ఇరుగుపొరుగు వాళ్లు వినూత్నంగా స్వాగతం పలికారు. విల్లే పార్లేలోని తన నివాసానికి మంగళవారం ఆయన వెళ్లగానే.. స్థానికులు అభినందల్లో ముంచెత్తారు. బ్యాండ్ బాజాలతో.. గులాబా రెమ్మలతో మజుందార్‌కు స్వాగతం పలికారు. కొందరు బ్యాట్లు చేతబూని అచ్చం క్రికెట్ మైదానంలో మాదిరిగా గార్డ్ ఆఫ్ హానర్‌తో ఆయనకు మర్చిపోలేని విధంగా వెల్కమ్ చెప్పారు. తనపై వాళ్లు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు సంబురపడిపోయిన మజుందార్.. కూల్‌గా నడుచుకుంటూ తన ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
Amol Muzumdar gets a hero’s welcome that he deserves!!
Thank you so very much for your contribution to Indian Cricket!! pic.twitter.com/2JIZPwXkK9
— Pushkar Joshi (@Pushkar_Jo) November 3, 2025
క్రికెటర్‌గా జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని మజుందార్ కోచ్‌గా టీమిండియాను విశ్వ విజేతగా నిలిపాడు. రెండేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టిన అతడు జట్టులో నిలకడ, స్థిరత్వం.. విజయకాంక్ష వంటి లక్షణాలను రగిల్చాడు. కెప్టెన్ హర్మన్‌తో కలిసి ప్రతిభావంతులకు ప్రాధాన్యమిచ్చిన ఆయన.. వరల్డ్ కప్‌లో తన మార్క్ చూపించాడు. రెండు విజయాల తర్వాత వరుసగా మూడు పరాజయాలు ఎదురైన వేళ ‘అధైర్యపడొద్దని.. సొంతగడ్డపై కప్‌ను గెలిచే సత్తా మీకుంద’ని హర్మన్ టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశాడు.
🇮🇳 Some heroes wear jerseys, others write legacies.
Amol Mazumdar — the coach who turned his missed dream into India’s triumph.Image Credits – @icc pic.twitter.com/MAo69hk542
— OneVision Media (@onevision_media) November 3, 2025
ఇంకేముంది.. న్యూజిలాండ్‌పై భారీ విజయంతో సెమీస్ చేరిన టీమిండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల విజయంతో మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరుకు ముందు ..’ఈ ఏడు గంటలు చాలా కీలకం. ఏం ఆలోచించకుండి. కప్ మనదే’ అనే సందేశంతో భారత బృందాన్ని కార్మోనుఖులను చేశాడు మజుందార్. కోచ్ మాటల్ని ఒంటబట్టించుకున్న భారత క్రికెటర్లు.. గెలవాలనే కసితో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటారు. సమిష్టిగా రాణించి 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా తొలి కప్ కలను చెదరగొడుతూ జగజ్జేతలుగా అవతరించారు.