కౌలాలంపూర్: మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో (Women’s T20 Asia Cup) యువ భారత్ అదరగొట్టింది. టోర్నీలో అపజయమెరుగని నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు కౌలాలంపూర్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) తొలిసారిగా నిర్వహిస్తున్న టోర్నీని టీమ్ఇండియా సొంతం చేసుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 117 పరుగులకు పరిమితమయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన బంగ్లా జట్టు 76 రన్స్‌కే ఆలౌట్ అయింది. దీంతో 41 రన్స్‌తో విజయం సాధించిన యువ భారత్ టోర్నీని విజేతగా నిలిచింది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే బ్యాటర్లు విఫలమవడంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 117 రన్స్‌కే పరిమితమైంది. అయితే కష్టాల్లో ఉన్న జట్టును తెలంగాణ యువ కెరటం గొంగడి త్రిష మరోసారి ఆదుకుంది. 5 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 41 బాల్స్‌లోనే 52 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. మరో బ్యాటర్ మైథిలి వినోద్ 12 బాల్స్‌లోనే 17 పరుగులు రాబట్టింది. ఇక చేజింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కొలేకపోయారు. దీంతో 18.3 ఓవర్లలో 76 రన్స్‌కే ఆలౌట్ అయ్యారు. ఆయుశి శుక్లా 3 వికెట్లు తీయగా, పరుణికా సిసోడియా 2 వికెట్లు పడగొట్టింది.
𝗕𝗢𝗪 𝗗𝗢𝗪𝗡 𝗧𝗢 𝗧𝗛𝗘 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦! 🏆
Presenting the winners of the inaugural edition of the #ACCWomensU19AsiaCup 2024 – India Women U19! 🇮🇳#ACC #INDWvsBANW pic.twitter.com/W7FGXyQDfE
— AsianCricketCouncil (@ACCMedia1) December 22, 2024
INDIA – THE CHAMPIONS 🏆
🔵 G Trisha 52 (47)
🟢 Farjana Easmin 4/31
🔵 Aayushi Shukla 3/17
🔵 Parunika Sisodia 2/12India beat Bangladesh to win the inaugural Women’s U-19 Asia Cup.#ACCwomensU19AsiaCup pic.twitter.com/2Srgoz39hl
— Women’s CricZone (@WomensCricZone) December 22, 2024
𝙏𝙝𝙖𝙩 𝘾𝙝𝙖𝙢𝙥𝙞𝙤𝙣 𝙁𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🏆
Scoreboard ▶️ https://t.co/uREtAlBiiq#TeamIndia | #ACC | #ACCWomensU19AsiaCup | #Final pic.twitter.com/WkSP8KBDmm
— BCCI Women (@BCCIWomen) December 22, 2024