Womens U18 Asia Cup: అండర్18 హాకీ.. భారత మహిళల జట్టుకు కాంస్య పతకం
Womens U18 Asia Cup: మహిళల అండర్ 18 ఆసియాకప్ హాకీలో భారత జట్టుకు కాంస్య పతకం దక్కింది. మూడవ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో కొరియాపై విజయాన్ని నమోదు చేసింది. సందీప్ కుమారి, స్వీటీ కుజుర్, నౌషీన్ నాజ్‌లు భారత్ తరపున గోల్స్ చేశారు.
కాకామిగహర: జపాన్‌లో జరుగుతున్న మహిళల అండర్ 18 ఆసియాకప్ హాకీ(Womens U18 Asia Cup)లో భారత జట్టుకు కాంస్య పతకం దక్కింది. మూడవ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో కొరియాపై విజయాన్ని నమోదు చేసింది. సందీప్ కుమారి, స్వీటీ కుజుర్, నౌషీన్ నాజ్‌లు భారత్ తరపున గోల్స్ చేశారు. సెమీఫైనల్స్ మ్యాచ్‌లో చైనా చేతిలో షూటౌట్ ఓడిన భారత జట్టు బ్రాంజ్ మెడల్ ఫైట్‌లో గట్టిగా పోరాడింది. ఆరంభంలోనే డ్రీమ్ స్టార్ట్ అందింది. తొలి రెండు నిమిషాల్లోనే సందీప్ కుమారి గోల్స్ చేసింది. దీంతో ఇండియా ఈ మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శించింది. మ్యాచ్ మొత్తం ఇండియా జట్టు అటాక్ చేసింది. ఇక ఆట 16వ నిమిషంలో స్వీటీ కుజుర్ ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యాన్ని పెంచింది. రెండు గోల్స్‌తో భారత మహిళల జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఆ తర్వాత మళ్లీ 33వ నిమిషంలో భారత్‌కు మరో గోల్ దక్కింది. నౌషీన్ ఆ గోల్ స్కోరు చేసింది. ఈ టోర్నీలో నౌషీన్ తన ఖాతాలో మొత్తం 12 గోల్స్ వేసుకున్నది. సందీప్ కుమారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

