విశాఖపట్టణం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ వన్డే(INDvSA)లో టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఓ మార్పు చేశారు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మను తీసుకున్నారు. విశాఖ వన్డే కోసం దక్షిణాఫ్రికా రెండు మార్పులు చేసింది. నంద్రే బర్గర్, టోనీ డీ జార్జీ గాయాల వల్ల మిస్ అవుతున్నారు. ఆ ఇద్దరి స్థానంలో బార్ట్మాన్, రికెల్టన్ను తీసుకున్నట్లు సఫారీ కెప్టెన్ బవుమా తెలిపారు.
వన్డేల్లో వరుసగా 20 మ్యాచుల్లో ఇండియా టాస్ ఓడిపోయింది. అయితే చాన్నాళ్ల తర్వాత ఇవాళ టాస్ గెలవడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు. మూడ వన్డే ఇరు జట్లకు కీలకం కానున్నది. ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లో ఇండియా, దక్షిణాఫ్రికా ఒక్కేసి మ్యాచ్ గెలిచాయి. నిర్ణయాత్మకంగా మారిన ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి రేపుతున్నది.
Here’s a look at #TeamIndia‘s Playing XI for the series decider 🙌
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/SAeo0okUT8
— BCCI (@BCCI) December 6, 2025