Under-19 World Cup : భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఇటీవల పెరిగిన దూరం మైదానంలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. ఇండియాలో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడబోమని బెట్టు చేస్తున్న బంగ్లా బోర్డుతో అంటీముట్టనట్టుగానే బీసీసీఐ వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే (Ayush Mhatre) బంగ్లాదేశ్ కెప్టెన్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు.
అండర్ -19 వరల్డ్‌కప్‌ను భారీ విజయంతో ఆరంభించిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొడుతోంది. జింబాబ్వేలోని బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో ఇరుజట్లు తలపడుతున్నాయి. బంగ్లా రెగ్యులర్ కెప్టెన్ ఎండీ అజీజుల్ హకీం తమిమ్ అనారోగ్యంతో దూరమవ్వగా.. వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ టాస్కు వచ్చాడు.
India captain Ayush Mhatre and Bangladesh vice-captain Zawad Abrar refused to shake hands after the toss at the U19 World Cup 2026 👀
📸: JioHotstar#U19WorldCup2026 #INDvsBAN #AyushMhatre #CricketTwitter pic.twitter.com/IcTK3F9ERM
— InsideSport (@InsideSportIND) January 17, 2026
అయితే.. టాస్ అనంతరం ఇరు జట్ల సారథులు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. కానీ, బంగ్లా కెప్టెన్‌తో కరచాలనం చేసేందుకు ఆయుష్ మాత్రే నిరాకరించాడు. ఇండియన్ కెప్టెన్ ఇలా ఎందుకు చేశాడు? అనే విషయంపై టీమ్ మేనేజ్మెంట్ స్పందించలేదు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక, క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నందునే మాత్రే టాస్ సమయంలో ప్రత్యర్థి కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు.
ఐసీసీ ఈవెంట్లలో భారత కెప్టెన్ ప్రత్యర్థి సారథికి షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడమనేది ఇటీవల కాలంలో ఇది రెండోసారి. నిరుడు టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్(Asia Cup 2025)లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) .. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు టాస్ సమయంలో షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. లీగ్ దశలో, సూపర్ 4, ఫైనల్లోనూ పాక్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయలేదు. పహల్గాం ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉన్నందున ఆ దేశ కెప్టెన్, ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.
Suryakumar Yadav on the no handshake stance of Team India in today’s match 🤝❌#AsiaCup #INDvPAK #TeamIndia pic.twitter.com/26jAsjRjz8
— Circle of Cricket (@circleofcricket) September 14, 2025
ఇప్పుడు అండర్ 19 ప్రపంచకప్ ముందు భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బీసీసీఐ ఆదేశాల మేరకు ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో రూ.9.2 కోట్లకు కొనుక్కున్న బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేసింది. దీనికి ప్రతిచర్యగా.. ఫిబ్రవరిలో భారతగడ్డపై తాము టీ20 ప్రపంచకప్ ఆడబోమని ఐసీసీకిబంగ్లాదేశ్ బోర్డు తెలిపింది. ఈ నేపథ్యంలోనే.. అండర్ -19 ప్రపంచకప్ లీగ్ దశ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్‌తో ఇండియన్ స్కిప్పర్ మాత్రే కరచాలనం చేయలేదు. ఆట ముగిశాక కూడా టీమిండియా ఆటగాళ్లు అంపైర్లకు మాత్రమే షేక్‌హ్యాండ్ ఇచ్చి డగౌట్‌కు వచ్చేయనున్నారు.
Suryakumar yadav No Handshake with #Pakistani captain Salman pig.😁#AsiaCup2025 #INDvPAK
इंडिया पकिस्तान pic.twitter.com/AAMlf7xisn— ĐHARMVIR CHAUHAN 🇮🇳 (@Dharmvi07902301) September 14, 2025