ప్రిటోరియా: అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో మన అమ్మాయిలు విజయం సాధించారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో భారత అండర్-19 జట్టు 54 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేశారు. శ్వేత (40), సౌమ్య (40) రాణించారు. కెప్టెన్ షఫాలీ వర్మ (0), హార్డ్ హిట్టర్ రిచా ఘోష్ (15) ఎక్కువసేపు నిలువలేకపోయారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 8 వికెట్లు కోల్పోయి 83 రన్స్ చేసింది. మన బౌలర్లలో తెలుగమ్మాయి షబ్నమ్, అర్చన చెరో మూడు వికెట్లు పడగొట్టారు.