సాలాహ్(ఒమన్): ఆసియా హాకీ 5ఎస్ టోర్నీలో భారత్ టైటిల్‌తో తళుక్కుమంది. శనివారం పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ పోరులో 2-0(పెనాల్టీ షూటౌట్) తేడాతో భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల గోల్స్ 4-4తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
ఆసియా కప్ విజయం ద్వారా వచ్చే ఏడాది జరిగే హాకీ 5ఎస్ ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా అర్హత సాధించింది. భారత్ తరఫున రాహిల్(19ని, 26ని) డబుల్ గోల్స్ చేయగా, జుగ్రాజ్సింగ్(7ని), మణిందర్‌సింగ్(10ని) ఒక్కో గోల్ చేశారు.