హాంగ్జౌ: ఆట ఏదైనా భారత్ చేతిలో పాకిస్థాన్‌కు పరాజయం శరామామూలు అయిపోయింది. క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో భారత్‌పై పాకిస్థాన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. ఆసియాకప్‌లోనూ భారత్‌పై పాక్‌కు మంచి రికార్డు లేదు. హాకీలోనూ పాక్‌పై భారత్‌దే పైచేయిగా కొనసాగుతూ వస్తున్నది. పురుషుల టీమ్స్‌లోనే కాదు, మహిళల టీమ్స్‌లో కూడా పాక్‌ది వెనుకబాటే. తాజాగా ఆసియా క్రీడల్లో కూడా భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైంది.
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మెన్స్ కబడ్డీ సెమీస్‌లో పాక్ చిత్తుగా ఓడిపోయింది. ఏకంగా 61-14 స్కోర్ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసి భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. అదేవిధంగా మెన్స్ హాకీ సెమీస్‌లో కూడా భారత్ ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ పోరుకు సిద్ధమైంది.