హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. కివీస్‌పై 372 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. దీంతో 1-0తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. 140/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన కివీస్.. గంటలోపే కుప్పకూలింది.
రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తన మొదటి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసి ఆలౌట్ అవగా, రెండో ఇన్సింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకు ఆలౌటవగా, రెండో ఇన్సింగ్స్‌లో 167 పరుగులకే బ్లాక్ క్యాట్స్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు.
#TeamIndia win the 2nd Test by 372 runs to clinch the series 1-0.
— BCCI (@BCCI) December 6, 2021
Scorecard – https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/uCdBEH4M6h
INDIA WIN by 372 runs 👏👏
— BCCI (@BCCI) December 6, 2021
Scorecard – https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/frGCmHknNP