న్యూఢిల్లీ: నూర్సుల్తాన్ వేదికగా జరుగుతున్న మహిళల అండర్-20 ఆసియా వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ అదరగొట్టింది. బుధవారం జరిగిన పూల్-బి మ్యాచ్‌లో భారత్ 3-0(25-21, 25-11, 25-14)తో కజకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన మన అమ్మాయిలు వరుస సెట్లలో కజకిస్థాన్‌ను చిత్తు చేశారు.
పూల్-బిలో భారత్ సహా డిఫెండింగ్ చాంపియన్ చైనా, జపాన్, చైనీస్ తైపీ, కజకిస్థాన్ పోటీపడుతున్నాయి.