IND vs PAK : ఆసియా కప్‌ను ఘన విజయంతో ఆరంభించిన భారత జట్టు (Team India) రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. యూఏఈపై రికార్డు విక్టరీ సాధించిన టీమిండియా తదుపరి పాకిస్థాన్(Pakistan)తో తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం ఇరుజట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. శత్రుదేశంతో క్రికెట్ వద్దు.. మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి. దాంతో.. ఇంతకూ టీమిండియా క్రికెటర్ల మనసులో ఏముంది? అనేది తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ (Sitanshu Kotak) ఊహాగానాలకు తెరదించాడు.
ఆసియా కప్‌లో టీమిండియా అన్ని మ్యాచ్‌లు ఆడుతుందని.. అది పాకిస్థాన్‌తో అయినా సరే తలపడుతుందని సితాన్షు కొటక్ స్పష్టం చేశాడు. శత్రుదేశపు జట్టుతో ఆడడంపై విమర్శలు వస్తున్నప్పటికీ తమకు కారణం ఉందని అంటున్నాడు సితాన్షు. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బీసీసీఐ ఇప్పటికే తేల్చేసింది. కాబట్టి మా దృష్టంతా ఆదివారం జరుగబోయే మ్యాచ్ మీదే ఉంది. అవును.. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్. ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఇప్పుడే కాదు ఎప్పుడైనా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉత్కంఠగానే సాగుతుంది అని సితాన్షు వెల్లడించాడు.
Batting coach Sitanshu Kotak speaks on India vs Pakistan game.. pic.twitter.com/6ygwcSd4DJ
— RVCJ Media (@RVCJ_FB) September 12, 2025
అంతేకాదు.. ఇరుదేశాల మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు, రాజకీయ నిర్ణయాల ప్రభావం ఆటగాళ్లపై ఉంటుందా? అనే ప్రశ్నకు కూడా బ్యాటింగ్ కోచ్ బదులిచ్చాడు. భారత ఆటగాళ్లు ప్రస్తుతం పాక్ మ్యాచ్ మీదే ఫోకస్ పెట్టారు. వాళ్ల మనసులో గేమ్ గురించిన ఆలోచన తప్ప మరేది లేదు అని సితాన్షు పేర్కొన్నాడు. సంజూ శాంసన్‌ను ఏ స్థానంలో ఆడిస్తారు? అనే ప్రశ్నకు అతడు.. సంజూ ఏ స్థానంలోనైనా ఆడగల బ్యాటర్. ఇప్పటివరకూ అతడు 5, 6వ ప్లేస్‌లో ఆడలేదు. అయితే.. ఇదేమీ పెద్ద సమస్య కాదు అని సమాధానమిచ్చాడు. సెప్టెంబర్ 14న రాత్రి 8 గంటలకు భారత్, పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
VIDEO | Indian cricket team’s batting coach Sitanshu Kotak said that wicket-keeper batter Sanju Samson is comfortable to bat at any position. He said: “Sanju Samson hasn’t batted a lot at no. 5 or 6, but that doesn’t mean he can’t bat at that position.”
(Full video available on… pic.twitter.com/2xSq0dlPWT
— Press Trust of India (@PTI_News) September 12, 2025