INDW VS BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వర్షం అంతరాయాలతో విసిగిపోతున్న అభిమానులకు గుడ్‌న్యూస్. డీవై పాటిల్ స్టేడియంలో భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు తొలి బంతి పడనుంది. అయితే.. డక్‌వర్త్ లూయిస్ (DLS) ప్రకారం ఓవర్ల కోత విధించారు అంపైర్లు. 43 ఓవర్ల మ్యాచ్ నిర్వహించనున్నారు. కాబట్టి.. పవర్ ప్లే 9 ఓవర్లకే ముగియనుంది.
ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో సెమీస్ ఫైట్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌గా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది టీమిండియా. ఇరుజట్ల మధ్య డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న చివరి లీగ్ దశ పోరు టాస్ పడగానే అందుకున్న వాన దాదాపు గంటన్నర తర్వాత శాంతించింది. దాంతో.. ఊపిరిపీల్చుకున్న సిబ్బంది సూపర్ సాపర్స్ సాయంతో ఔట్‌ఫీల్డ్‌ను సిద్దం చేస్తున్నారు. గంటన్నర సమయం వృథా అయినందున ఓవర్లను తగ్గించి ఆడిస్తున్నారు అంపైర్లు. ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడి.. 43 ఓవర్ల మ్యాచ్ సాధ్యపడుతుందని చెప్పారు.
𝘿𝙚𝙗𝙪𝙩 𝘿𝙞𝙖𝙧𝙞𝙚𝙨 ✨
The beginning of a new chapter built on hard work and dedication 👏
Presenting #TeamIndia ODI cap no.1️⃣5️⃣7️⃣ – Uma Chetry 🧢
Get your #CWC25 tickets 🎟 now: https://t.co/vGzkkgwXt4#WomenInBlue | #INDvBAN pic.twitter.com/J5msIKUVmZ
— BCCI Women (@BCCIWomen) October 26, 2025