రాజ్‌గిర్(బీహార్): ప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీలో ఆతిథ్య భారత్ ఫైనల్ బెర్తుకు మరింత చేరువైంది. గురువారం జరిగిన సూపర్-4 రెండో మ్యాచ్‌లో భారత్ 4-1 తేడాతో మలేషియాపై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూపు 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్ భారత్ తరఫున మన్‌ప్రీత్‌సింగ్ (17ని), సుఖ్జీత్సింగ్ (19ని), శీలానంద్ లక్రా (24ని), వివేక్‌సాగర్ ప్రసాద్ (38ని) గోల్స్ చేశారు. మరోవైపు షఫీక్(2ని) మలేషియాకు ఏకైక గోల్ అందించాడు.