నాటింగ్‌హామ్: భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య పొట్టి పోరుకు రంగం సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య తొలి పోరు జరుగనుంది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరుగున్న పొట్టి ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా రెండు జట్లు సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెగాటోర్నీకి మరో ఏడాది ఉన్నా..ఇక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చేందుకు సిరీస్‌ను వినియోగించుకోవాలని టీమ్ఇండియా చూస్తున్నది.
హార్డ్‌హిట్టర్ షెఫాలీవర్మ పునరాగమనం చేయగా ఆల్‌రౌండర్లు స్నేహ్‌రానా, అమన్జ్యోత్కౌర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023 ఫిబ్రవరి తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన రానా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నది. పేస్‌బౌలర్లు రేణుకాసింగ్, పూజవస్ర్తాకర్ లేకపోడం లోటుగా కనిపిస్తున్నా..హైదరాబాదీ అరుంధతిరెడ్డిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు నాట్స్కీవర్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్‌కు అమీజోన్స్, బ్యూమౌంట్, డానీ వ్యాట్, ఎకల్‌స్టోన్ లాంటి క్రికెటర్లు మెండైన బలమని చెప్పొచ్చు.