మాంచెస్టర్: ఊహించిందే జరిగింది. ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగాల్సిన చివరి టెస్ట్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక రోజు ముందు ఇండియన్ టీమ్‌లోని సిబ్బంది ఒకరికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ జరగడంపై ముందే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి బీసీసీఐతో చర్చించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. టీమ్‌లో మరిన్ని కొవిడ్ కేసులు వస్తాయన్న ఆందోళనతో టీమ్‌ను బరిలోకి దించడానికి ఇండియన్ టీమ్ సుముఖంగా లేదు అని ఈసీబీ తెలిపింది.
అభిమానులు, స్పాన్సర్లందరికీ క్షమాపణలు చెప్పింది. గురువారం టీమిండియా అసిస్టెంట్ ఫిజియో థెరపిస్ట్ యోగేశ్ పార్మర్ కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ప్లేయర్స్ అందరికీ నెగటివ్‌గా తేలినా.. ఇలాంటి పరిస్థితుల్లో బరిలోకి దిగడానికి ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ సిద్దంగా లేమని చెప్పినట్లు సమాచారం. టీమ్ మేనేజ్మెంట్తో బీసీసీఐ చర్చించిన సమయంలో ప్లేయర్స్ తన విముఖతను వ్యక్తం చేశారు.
Following ongoing conversations with the BCCI, the ECB can confirm that the fifth LV= Insurance Test at Emirates Old Trafford, due to start today, will be cancelled.
— England Cricket (@englandcricket) September 10, 2021