చెన్నై: బంగ్లాదేశ్(Ind Vs Ban)తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ 376 రన్స్‌కు ఆలౌటైంది. రెండో రోజు ఉదయం సెషన్లో ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయింది. బంగ్లా బౌలర్ తస్కిన్ రెండో రోజు మూడు వికెట్లను తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ తొలి న్నింగ్స్‌లో స్పీడ్‌స్టర్ హసన్ అహ్మద్ తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. రెండో రోజు బుమ్రా వికెట్‌ను తీశాడతను. తస్కిన్, హసన్‌లు తమ ఖాతాలో 8 వికెట్లు వేసుకున్నారు.
Innings Break!
A mammoth 199 run partnership between @ashwinravi99 (113) & @imjadeja (86) steers #TeamIndia to a first innings total of 376.
Scorecard – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/UWFcpoxN9U
— BCCI (@BCCI) September 20, 2024
తొలి రోజు ఆరు వికెట్లకు 339 రన్స్ చేసిన ఇండియా.. రెండో రోజు కేవలం 37 పరుగులు మాత్రమే జోడించి చివరి 4 వికెట్లను చేజార్చుకున్నది. సెంచరీకి చేరువు అవుతున్న జడేజా తొలుత అవుటయ్యాడు. అతను 86 రన్స్ చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్ 17 రన్స్ చేసి క్యాచ్ అవుటయ్యాడు. చివరకు అశ్విన్ కూడా తస్కిన్ బౌలింగ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లాడు. అశ్విన్ 113 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
💥Stellar Bowling Performance💥
Hasan Mahmud claimed his second five-wicket haul, becoming the first Bangladeshi player to achieve this feat in India.👏🇧🇩#BCB #Cricket #INDvBAN #WTC25 pic.twitter.com/8pd21ERxny— Bangladesh Cricket (@BCBtigers) September 20, 2024
మొదటి రోజు హసన్ బౌలింగ్ తరహాలో రెండో రోజు తస్కిన్ చెలరేగిపోయాడు. టెస్టుల్లో అయిదు వికెట్లు తీసుకోవడం హసన్‌కు ఇది రెండోసారి.