బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడవ టెస్టు(Aus Vs Ind) మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా 260 రన్స్‌కు ఆలౌటైంది. అయిదో రోజు మొదటి సెషన్లో కేవలం 24 బంతులు మాత్రమే వేశారు. వర్షం రావడంతో ఆ సెషన్ పూర్తిగా జరగలేదు. అయితే ఆకాశ్ దీప్, బుమ్రా మధ్య పదో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. నాలుగవ రోజు ఫాలో ఆన్ తప్పించడంలో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ఆకాశ్ దీప్ కొన్ని భారీ షాట్లతో ఆసీస్ బౌలర్లను పరేషన్ చేశాడు. ఇవాళ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను స్టంప్ ఔటయ్యాడు.
లంచ్ బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. భారత పేస్ బౌలర్లు ఆసీస్ టాపార్డర్‌ను వణికించేశారు. 10 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. బుమ్రా రెండు, ఆకాశ్ రెండు వికెట్ తీసుకున్నారు. మెక్‌స్వీనే 4, ఖాజా 8, లబుషేన్ ఒక పరుగు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 213 రన్స్ ఆధిక్యంలో ఉన్నది.
Usman Khawaja ✅
Marnus Labuschagne ✅Vice-captain Jasprit Bumrah at it again 🔥🔥
Live – https://t.co/dcdiT9NAoa#TeamIndia | #AUSvIND | @Jaspritbumrah93 pic.twitter.com/GzWFSQqkyI
— BCCI (@BCCI) December 18, 2024