ఓవల్: ఇంగ్లండ్ బౌలర్లు చుట్టేశారు. ఆ పేసర్ల ధాటికి ఓవల్ టెస్టు(ENGvIND)లో ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. ఆరు వికెట్ల నష్టానికి 204 పరుగల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా.. రెండో రోజు కేవలం మరో 20 రన్స్ జోడించి చేతులెత్తేసింది. నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్‌లు త్వరగా నిష్క్రమించడంతో.. టెయిలెండర్లు స్కోరు బోర్డును పరుగెత్తించలేకపోయారు.
ఇంగ్లండ్ బౌలర్ అట్కిన్సన్ 33 రన్స్ ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. రెండో రోజు కేవలం అరగంటలోనే భారత్ ఇన్నింగ్స్‌ను ముగించేశారు. కరుణ నాయర్ 57, సుందర్ 26 రన్స్ చేసి ఔటయ్యారు. ఇక సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ డకౌట్ అయ్యారు. కీలకమైన నాయర్ వికెట్‌ను టాంగ్ తీసుకున్నాడు.
Innings Break!
Karun Nair top-scores with 57(109) as #TeamIndia post 2⃣2⃣4⃣ in the first innings at the Oval.
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE#ENGvIND pic.twitter.com/L7BjTjtpb4
— BCCI (@BCCI) August 1, 2025
రెండో రోజు ఆటలో వోక్స్ లేకున్నా.. చాలా ఈజీగా ఇండియన్ ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ బౌలర్లు ప్యాకప్ చేశారు. ఈ సిరీస్‌లో భారత టెయిలెండర్ల పర్ఫార్మెన్స్ మరీ అధ్వాన్నంగా ఉంది. స్పీడ్ బౌలర్లు కాంబోజ్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిద్ధి కృష్ణ.. ఒక్క మ్యాచ్‌లో కూడా బ్యాట్‌తో రాణించలేదు. ఎవరు కూడా ఈ సిరీస్‌లో డబుల్ ఫిగర్ స్కోర్ చేయలేదు. వాళ్లు ఈ సిరీస్‌లో మొత్తం కలిపి 48 రన్స్ మాత్రమే చేశారు.