కోల్‌కతా : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు(INDvSA) తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 189 రన్స్‌కు ఆలౌటైంది. బౌలర్లకు అనుకూలిస్తున్న ఈడెన్ మైదానంలో భారత బ్యాటర్లు కూడా తడబడ్డారు. ఇవాళ ఉదయం రిటైర్డ్ హార్ట్ అయిన కెప్టెన్ శుభమన్ గిల్ మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. మెడ పట్టేయడంతో గిల్ క్రీజ్‌ను వదిలిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా బౌలర్లలో పేసర్ మార్కో జేన్సన్, ఆఫ్ స్పిన్నర్ సైమర్ హార్మర్ భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. జేన్సన్ 3 వికెట్లు తీసుకోగా, హార్మర్ 4 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేవలం 30 రన్స్ మాత్రమే లీడ్ సాధించింది ఇండియా. భారత జట్టులో కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను అత్యధికంగా 39 రన్స్ చేశాడు. పంత్, జడేజా.. 27 రన్స్ చేశారు.
Kuldeep Yadav strikes for #TeamIndia on the stroke of Tea on Day 2! ☝️🫖
He traps Ryan Rickelton plumb in front 👍
Scorecard ▶️ https://t.co/okTBo3qxVH #INDvSA | @IDFCFIRSTBank | @imkuldeep18 pic.twitter.com/bdX3NYTVeX
— BCCI (@BCCI) November 15, 2025
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. 9 ఓవర్లలో 25 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రియాన్ రికల్టన్ 11 రన్స్ చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కుల్దీప్ అతని వికెట్ తీశాడు. ఇక జడేజా బౌలింగ్‌లో మార్క్రమ్ ఔటయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 159 రన్స్ చేసిన విషయం తెలిసిందే.