సొలో(ఇండోనేషియా): బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భారత్ 110-83తో యూఏఈపై అద్భుత విజయం సాధించింది. తమ తొలి పోరులో శ్రీలంకను చిత్తుచేసిన భారత్..మలిపోరులో యూఏఈ భరతం పట్టింది.
ఆదివారం హాంకాంగ్‌తో భారత జట్టు తలపడనుండగా, ఇందులో గెలిచిన జట్టు గ్రూపు-డీలో అగ్రస్థానంలో నిలువనుంది. రిలే స్కోరింగ్ ఫార్మాట్లో జరుగుతున్న టోర్నీలో మొత్తం 10 మ్యాచ్‌ల్లో భారత్ 110 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తొలుత బాలికల సింగిల్స్‌లో రుజుల రాము 11-5తో మైషాఖాన్పై గెలువగా, మిక్స్డ్ డబుల్స్‌లో లాల్రామ్సంగా, తరణి సురి జోడీ 22-11తో విజయం సాధించింది.