లక్నో: సొంతగడ్డపై ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తడబాటుకు గురైంది. సాయి సుదర్శన్ (75) మినహా మిగిలిన బ్యాటర్లంతా విఫలమవడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 194 రన్స్‌కే ఆలౌట్ అయింది.
సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (11), కెప్టెన్ జురెల్ (1), పడిక్కల్ (1), నితీశ్ రెడ్డి (1) విఫలమయ్యారు. దీంతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ (420 ఆలౌట్)లో 226 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆ జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.