మకాయ్: ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా‘ఎ’ జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్‌కు గురువారం తెరలేవనుంది. భారత సీనియర్ తుది జట్టులో చోటు ఆశిస్తున్న యువ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, నితీశ్‌కుమార్‌రెడ్డి, ప్రసిద్ద్ కృష్ణపై ప్రధానంగా దృష్టి నెలకొన్నది. ఇప్పటికే జట్టుకు ఎంపికైన ఈ ముగ్గురు.. యువ ఆసీస్‌పై సత్తాచాటాలని చూస్తున్నారు. అయితే ఆసీస్ పరిస్థితులకు వీళ్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ దూరమైతే..అభిమన్యు తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్‌ను ప్రయోగించేందుకు టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నది.