న్యూఢిల్లీ: వచ్చే నెలలో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నది. టూర్లో భాగంగా టీమ్ఇండియా.. సఫారీ గడ్డపై రెండు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో బోర్డు అంతకుముందే యువ జట్టుతో షాడో టూర్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో భారత-ఏ జట్టు మూడు అనధికారిక టెస్టులు (నాలుగు రోజుల మ్యాచ్‌లు) ఆడనుంది.
దీని కోసం త్వరలోనే జట్టును ఎంపిక చేయనుండగా.. దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శన చేస్తున్న యువ ఆటగాళ్లకు చాన్స్ దక్కనుంది. మన ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఒక అవగాహనకు వచ్చేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని బీసీసీఐ అధికారి తెలిపారు. దీంతో అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, జైదేవ్ ఉనాద్కట్‌కు భారత-ఏ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.