ఢిల్లీ: ఈ ఏడాది జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహకంగా భారత ‘ఏ’ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇంగ్లండ్ లయన్స్‌తో ఆడబోయే రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లలో భారత సీనియర్ జట్టులో ఆడబోయే పలువురు స్టార్ క్రికెటర్లు పాల్గొననున్నట్టు సమాచారం.
మే 30న మొదటి, జూన్ 6న రెండో ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ నాకౌట్ దశ (మే 20) మొదలయ్యాక అందుబాటులో ఉండే టెస్టు జట్టు సభ్యులు లండన్ విమానమెక్కనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.