బెంగళూరు: దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో బౌలర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత ‘ఏ’ జట్టుకు కీలక ఆధిక్యం దక్కింది. మొదటి రోజు భారత్ ‘ఏ’ 255 రన్స్‌కు ఆలౌట్ అవగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ‘ఏ’ 221కే కుప్పకూలడంతో ఆతిథ్య జట్టు 34 రన్స్ ఆధిక్యం సాధించింది. సఫారీల రెగ్యులర్ సారథి టెంబా బవుమా డకౌట్ అయ్యాడు.
అకర్మన్ (134) శతకం సాధించడం మినహా మిగిలినవారిలో 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. భారత పేసర్లు ప్రసిద్ధ్ (3/35), సిరాజ్ (2/61), ఆకాశ్ (2/28) రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ సేన రెండో రోజు ఆట ముగిసే సమయానికి 78/3గా నిలిచి ఓవరాల్‌గా 112 రన్స్ ఆధిక్యంలో ఉంది.