మెల్బోర్న్: ఆస్ట్రేలియా-ఏతో మెల్బోర్న్లో జరుగుతున్న రెండవ అనధికార టెస్టులో.. ఇండియా-ఏ జట్టు కేవలం 161 పరుగులకే ఆలౌటైంది. కీపర్ ద్రువ్ జురల్ అత్యధికంగా 80 రన్స్ చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్(KL Rahul) కేవలం నాలుగు రన్స్ చేసి నిష్క్రమించాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో అతను ఔట్ అయ్యాడు. త్వరలో భారత్‌తో జరగనున్న అయిదు టెస్టుల సిరీస్‌కు ఆస్ట్రేలియా తరపున స్కాట్ బోలాండ్ ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్‌తో పాటు ఇండియా టెస్టు జట్టుకు ఎంపికైన బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ డకౌట్ అయ్యాడు.
ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో ఈశ్వరన్ అందుబాటులో ఉంటాడు. ఇండియన్ బ్యాటర్లలో పడిక్కల్ 26, నితీశ్ కుమార్ రెడ్డి 16, జురల్ 80, ప్రసిద్ధి కృష్ణ రన్స్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మైఖేల్ నీసర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మరో బౌలర్ బ్యూ వెబ్‌స్టర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఈశ్వరన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉన్నది. 100 మ్యాచుల్లో అతను 27 సెంచరీలు చేశాడు. 49.90 సగటుతో అతను బ్యాటింగ్ చేస్తాడు. ఇక మిడిల్ ఆర్డర్లో ఆడే రాహుల్.. ఇండియా ఏ మ్యాచ్‌లో మాత్రం ఓపెనర్‌గా దిగాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాపై గతంలో టెస్టుల్లో సెంచరీ చేశాడు.