IND vs AUS : ఆస్ట్రేలియా నిర్ధేశించిన 277 పరుగుల చేధనలో భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(32), రుతురాజ్ గైక్వాడ్(32) ధాటిగా ఆడుతున్నారు. తొలి ఓవర్ నుంచే ఇద్దరూ దంచడం మొదలెట్టారు. సొంత మైదానంలో రెచ్చిపోయిన గిల్ ఆసీస్ ప్రధాన పేసర్లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. దాంతో, 8.4 ఓవర్లకే ఇండియా స్కోర్ 50 దాటింది. 10 ఓవర్లకు భారత జట్టు వికెట్ కోల్పోకుండా 66 పరుగులు చేసింది.
A steady 50-run partnership comes up between @ShubmanGill & @Ruutu1331 👏👏
Live – https://t.co/H6OgLtww4N…… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/elcmEZm1Ep
— BCCI (@BCCI) September 22, 2023
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(52), జోష్ ఇంగ్లిస్(45), స్టీవ్ స్మిత్(41) మాత్రమే రాణించారు. పేసర్ షమీ దెబ్బకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది.
తొలి స్పెల్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్(4), స్టీవ్ స్మిత్(41)లను ఔట్ చేసిన షమీ ఆసీస్ టాపార్డర్‌ను కూల్చాడు. ఆ తర్వాత రెండో స్పెల్‌లో మిడిల్ ఆర్డర్ పని పట్టాడు. డేంజరస్ ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్(29), మాథ్యూ షార్ట్(2)తో పాటు బౌలర్ సియాన్ అబాట్(2)లను పెవిలియన్ పంపి షమీ 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.