IND W vs IRE W | రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం..
IND W vs IRE W | ఐర్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా జట్టు విజయం సాధించింది. 116 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్నది. ఇక సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 15న రాజ్‌కోట్ వేదికగా జరుగనున్నది.
IND W vs IRE W | ఐర్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా జట్టు విజయం సాధించింది. 116 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్నది. ఇక సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 15న రాజ్‌కోట్ వేదికగా జరుగనున్నది. నెదర్లాండ్ వుమెన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ జట్టు కెప్టెన్ స్మృతి మందాన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మంధాన (73), ప్రతీకా రావల్ (67), హర్లీన్ డియోల్ (89), జెమీమా రోడ్రిగ్స్ (102) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. వన్డే క్రికెట్లో టీమిండియా చేసిన అత్యధిక స్కోర్ ఇదే. ఇంతకు ముందు 2017లో ఐర్లాండ్‌పై రెండు వికెట్ల నష్టానికి 358 పరుగుల స్కోర్ చేసింది.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 254 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఐర్లాండ్‌కు మంచి ఆరంభం లభించలేదు. జట్టుకు తొలి దెబ్బ కెప్టెన్ గాబీ లూయిస్ (12) అవుట్ అయ్యింది. సయాలి సత్ఘారే బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో క్రిస్టినా కౌల్టర్ 80తో టాప్ స్కోరర్‌గా నిలిచింది. సారా ఫోర్బ్స్ 38, లారా డెన్లీ 37 పరుగులు చేసింది. వీరికి మరో ఎండ్ నుంచి బ్యాట్స్‌మెన్ పెద్ద ఇన్సింగ్స్ ఆడలేకపోయారు. దీప్తి శర్మ, ప్రియా మిశ్రా స్పిన్ బౌలింగ్‌లో ఐర్లాండ్ బ్యాట్ వుమెన్స్ ఇబ్బంది పడ్డారు. దీప్తి మూడు వికెట్లు పడగొట్టగా, ప్రియా 53 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు. టైటాస్ సాధు, సయాలి సత్ఘారే ఒక్కొ వికెట్ దక్కింది.
కెప్టెన్ స్మృతి మంధాన, ప్రతీక మరోసారి టీమ్ ఇండియాకు మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ మొదటి వికెట్‌కు 156 పరుగులు జోడించారు. మంధాన 54 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులు చేసింది. ప్రతీక 61 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, సిక్సర్ సహాయం 67 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ హాఫ్ సెంచరీ నమోదు చేసింది. 84 బంతుల్లో 12 ఫోర్లతో 89 పరుగులు చేసింది. జెమీమా 91 బంతుల్లో 12 ఫోర్లతో 102 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో, వన్డేల్లో జెమీమాకు ఇది తొలి సెంచరీ. చివరలో రిచా ఘోష్ పది పరుగులు అవుట్ అయ్యింది. తేజల్ హసబ్నిస్, సయాలి సత్ఘారే చెరో రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఐర్లాండ్ తరఫున ఓర్లా ప్రెండర్‌గాస్ట్, అర్లీన్ కెల్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జార్జినా డెంప్సే ఒక వికెట్ తీసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

