జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటింగ్ తడబడింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి టీమిండియా తరఫున బ్యాటింగ్ చేయడానికి వచ్చిన కేఎల్ రాహుల్ (1) తీవ్రంగా నిరాశపరిచాడు. ధవన్‌కు జోడీగా వచ్చిన అతను ఐదు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి, ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
ఇషాన్ కిషన్ (6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కాసేపు నిలబడిన శిఖర్ ధావన్ (33), శుభ్‌మన్ గిల్ (33) అవుటైన తర్వాత.. జట్టును ముందుకెళ్లే బాధ్యతను దీపక్ ముడా (18 నాటౌట్), సంజూ శాంసన్ (20 నాటౌట్) భుజాలకు ఎత్తుకున్నారు. ఈ క్రమంలో 20 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులతో నిలిచింది.