IND Vs WI | వచ్చే నెలలో భారత్‌తో జరిగే రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యుల జట్టును వెస్టిండిస్ ప్రకటించింది. ఈ సిరీస్‌లో మాజీ కెప్టెన్ క్రెయిగ్ బ్రైత్వైట్కు అవకాశం లభించలేదు. టాగెనరైన్ చందర్‌పాల్, అలిక్ అథనాజ్లకు జట్టులో చోటు దక్కింది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు అహ్మదాబాద్‌లో, అక్టోబర్ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో భారత్‌తో వెస్టిండిస్ టెస్టులు ఆడనున్నది.
భారత్‌తో జరిగే ఈ రెండుటెస్టుల సిరీస్‌తో వెస్టిండిస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్‌ను ప్రారంభిస్తుంది. వెస్టిండీస్‌కు రోస్టన్ చేజ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. జోమెల్ వారికన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. సెలెక్టర్లు తొలిసారిగా టెస్ట్ జట్టులో 33 ఏళ్ల ఆల్ రౌండర్ ఖారీ పియరీకి అవకాశం కల్పించారు. చివరి భారత పర్యటన (2018)లో జట్టుకు నాయకత్వం వహించిన బ్రైత్‌వైట్ ఈ ఏడాది మార్చిలో కెప్టెన్సీకి రాజీనామా చేశారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన తర్వాత అతనికి జట్టు నుంచి ఉద్వాసన పలికింది.
టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌ను బలోపేతం చేయడానికి చందర్‌పాల్, అథనాజ్లను జట్టులోకి తీసుకుంది. వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్‌లో బలమైన ప్రదర్శన తర్వాత పియరీని రెండవ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పియరీ 13.56 సగటుతో 41 వికెట్లు పడగొట్టాడని అని క్రికెట్ వెస్టిండీస్ తన వెబ్సైట్లో తెలిపింది.
రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమ్మెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవెలాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షై హోప్ (వికెట్ కీపర్), టెవిన్ ఇమ్లాచ్, అల్జారి జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియరీ, జాడెన్ సీల్స్. ఇదిలా ఉండగా.. డారెన్ సామీ (హెడ్‌కోచ్), ఫ్లాయ్ రీఫర్ (బ్యాటింగ్ కోచ్), రవి రాంపాల్ (బౌలింగ్ కోచ్), ర్యాన్ గ్రిఫిత్ (ఫీల్డింగ్ కోచ్)తో కలిసి వెస్టిండిస్ జట్టు భారత్‌లో పర్యటించనున్నది.