భారత యువపేసర్ ప్రసిద్ధ్ కృష్ణ సత్తా చాటాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కీలక వికెట్లు పడగొట్టాడు. విండీస్ ఓపెనర్లపై ఆరంభంలో ఒత్తిడి పెంచిన.. మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వికెట్లు తీయడంలో మాత్రం విఫలమయ్యారు. ఆ తర్వాత వీరి బౌలింగ్‌కు అలవాటు పడిన బ్రాండన్ కింగ్ (18) భారీ షాట్లు ఆడటం ప్రారంభించాడు. అలాంటి సమయంలో బంతి అందుకున్న ప్రసిద్ధ్.. కింగ్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత తొలి పవర్‌ప్లే చివరి ఓవర్లో మరోసారి బంతి అందుకున్న అతను.. డారెన్ బ్రావో (1)ను అవుట్ చేశాడు.
ఆఫ్‌సైడ్ ఆవల వేసిన బంతి.. బ్రావో బ్యాటును తాకి, వికెట్ కీపర్‌కు చేరింది. అయితే అంపైర్ నితిన్ మీనన్ అవుట్ ఇవ్వలేదు. దీంతో కాసేపు ఆలోచించిన రోహిత్.. రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి చాలా బ్యాటును ముద్దాడుతూ వెళ్లినట్లు కనిపించింది. దీంతో అంపైర్ తన నిర్ణయం మార్చుకోవలసి వచ్చింది. అంతే భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. డారెన్ బ్రావో పెవిలియన్ బాటపట్టాడు. ఈ ఓవర్లో ప్రసిద్ధ్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. వికెట్ మెయిడెన్‌తో తొలి పవర్‌ప్లే ముగించాడు.