స్పిన్నర్లు రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసి.. పది ఓవర్లకు లంకను 71/2 స్కోరు వద్ద నిలిపారు. ఆ తర్వాత మరోసారి బంతి అందుకున్న హర్షల్ పటేల్ తను కూడా తక్కువేమీ కాదని నిరూపించుకున్నాడు. 11వ ఓవర్ వేసిన అతను ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి కమిల్ మిషార వికెట్ తీశాడు. లెంగ్త్ వేరియేషన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన అతను చివరకు మిషారను బుట్టలో వేసుకున్నాడు.
హర్షల్ వేసిన స్లో బాల్‌ను డ్రైవ్ చేయడానికి మిషార ప్రయత్నించాడు. కానీ అది స్లో బాల్ అని అతను గుర్తించకపోవడంతో.. షార్ట్ కవర్‌కు నేరుగా క్యాచ్ వళ్లింది. నేలకు చాలా దగ్గరగా వచ్చిన లో క్యాచ్‌ను శ్రేయాస్ అయ్యర్ తెలివిగా అందుకోవడంతో మిషార ఇన్నింగ్స్ ముగిసింది. అయితే క్రీజులో ఉన్న నిస్సంక (43 నాటౌట్) రాణిస్తుండటంతో లంక స్కోరు బోర్డు ముందుకు సాగుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరు 92/3గా ఉంది.
Harshal Patel strikes with the wicket of Kamil Mishara.
Live – https://t.co/KhHvQG09BL #INDvSL @Paytm pic.twitter.com/htZTptdkGH
— BCCI (@BCCI) February 26, 2022