భారత జట్టును మరోసారి మిడిలార్డర్ వైఫల్యం ఇబ్బందుల్లో పడేసింది. ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (6), ఫామ్లో ఉన్న కోహ్లీ (0) ఇద్దరూ విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో బ్యాటింగ్ కుప్పకూలకుండా జాగ్రత్తపడిన రోహిత్ శర్మ (72), సూర్యకుమార్ యాదవ్ (34) రాణించారు.
అయితే ఆ తర్వాత మరెవరూ సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. హార్దిక్ పాండ్యా (17), రిషభ్ పంత్ (17), దీపక్ హుడా (3) పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో అశ్విన్ (7 బంతుల్లో 15 నాటౌట్) భారీ సిక్సర్ బాదాడు. భువనేశ్వర్ కుమార్ (0), అర్షదీప్ సింగ్ (1 నాటౌట్) అతనికి సహకారం అందించారు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లతో చెలరేగగా.. చమిక కరుణరత్నే, శనక చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. తీక్షణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Innings Break!#TeamIndia post a total of 173/8 on the board.
Over to our bowlers now 🙌
Scorecard – https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/g77BzXkt8b
— BCCI (@BCCI) September 6, 2022