IND vs SL : భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వెనుదిరిగాడు. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక వేసిన 21వ ఓవర్లో అతను ఎల్బీగా అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. టీ20 సిరీస్‌లో విఫలమైన గిల్ ఈ మ్యాచ్‌లో కళాత్మక షాట్లు ఆడాడు. అంతేకాదు కెరీర్లో 5వ వన్డే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 78 పరుగులు, కోహ్లీ 11 తో క్రీజులో ఉన్నారు. 22 ఓవర్లకు భారత్ ఒక వికెట్ నష్టానికి 161 పరుగులు చేసింది. పోయిన ఏడాది బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన కోహ్లీ మళ్లీ అలాంటి ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు.
టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ షనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం అయ్యారు. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్, మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ వన్డేలో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని భారత్ భావిస్తోంది.