IND vs SL : స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు షాక్.. ఓపెనర్లు ఇద్దరూ అవుట్ అయ్యారు. కుమార గిల్‌ను పెవిలియన్ పంపి కుమార లంకకు రెండో వికెట్ అందించాడు. అతని బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (21) క్యాచ్ అవుట్ అయ్యాడు. అంతకుముందు ఓవర్లో ఛమిక కరుణరత్నే బౌలింగ్‌లో రోహిత్ శర్మ (17) అవుట్ అయ్యాడు. రోహిత్, శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఐదో ఓవర్లకు 33 పరుగులు జోడించాడు. కసున్ రజిత వేసిన తొలి ఓవర్లోనే రోహిత్ దూకుడు ప్రదర్శించాడు. రెండో బంతికే ఫోర్ కొట్టాడు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి భారత్ 46 పరుగులు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 40 ఓవర్లలో 215 పరుగులు ఆలౌట్ అయింది. ఓపెనర్ నువనిదు ఫెర్నాండో (50) టెయిలెండర్లు వెల్లలాగే (32), వనిందు హసరంగ (21), చమిక కరుణరత్నే(17) రాణించడంతో ఆ జట్టు రెండొందలకు పైగా పరుగులు చేయగలిగింది.