శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కష్టాలు పడుతోంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు తొలి ఓవర్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ (23 నాటౌట్), ఇషాన్ కిషన్ (16) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా అయ్యర్ తనదైన స్టైల్లో చెలరేగి ఐదో ఓవర్ చివరి మూడు బంతులను బౌండరీలకు తరలించాడు.
అయితే ఆ తర్వాతా ఆరో ఓవర్ తొలి బంతికే లాహిరు కుమార్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరాడు. ఆఫ్‌సైడ్ వచ్చిన బంతిని మిడ్‌వికెట్ దిశగా ఆడేందుకు కిషన్ ప్రయత్నించాడు. కానీ సరిగా అంచనా వేయలేక పోవడంతో మిడాన్‌లో షానకకు సులభమైన క్యాచ్ అందింది. దాన్ని అతను అందుకోవడంతో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో సంజు శాంసన్ క్రీజులోకి వచ్చాడు. తొలి పవర్ ప్లే ముగిసే సరికి భారత జట్టు 42/2 స్కోరుతో నిలిచింది.