IND vs SL : భారత్, శ్రీలంక మధ్య రేపు గువాహటిలో తొలి వన్డే జరగనుంది. టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ కూడా గెలవాలనే కసితో ఉంది. వన్డే సిరీస్ అయినా సాధించి గౌరవం కాపాడుకోవాలనే ఉద్దేశంతో లంక బరిలోకి దిగనుంది. అయితే.. ఇరుజట్లు గతంలో తలపడిన వన్డేల్లో భారత్ ఆధిపత్యం కనబరిచింది. గత రికార్డులను పరిశీలిస్తే.. టీమిండియాదే పై చేయి ఉంది. భారత్ – శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకూ 162 వన్డేలు జరిగాయి. వీటిలో భారత్ అత్యధికంగా 93 మ్యాచుల్లో గెలిచింది. లంక 57 గేమ్స్‌లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై అయింది. 11 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. భారత పర్యటనలో మాత్రం శ్రీలంకకు చెత్త రికార్డు ఉంది. 41 వన్డేల్లో 30 ఇండియా విజేతగా నిలిచింది. శ్రీలకం కేవలం 8 మ్యాచుల్లోనే గెలిచింది. 3 మ్యాచుల్లో ఫలితం తేలలేదు.
టీ20 సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టుతో కలవడంతో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. మిడిలార్డర్లో పరుగుల వరద పారించడానికి సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా ఉండనే ఉన్నారు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ టీ20ల్లో అదరగొట్టడం టీమిండియాకు ప్లస్ పాయింట్. దసున్ శనక కెప్టెన్సీలో శ్రీలంక ఈమధ్య అధ్బుతంగా ఆడుతోంది. పోయిన సీజన్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. కుర్రాళ్లతో నిండిన ఆ జట్టుని తక్కువ అంచనా వేయడానికి లేదు.
ODIs at home: 41
🇮🇳: 30, 🇱🇰: 8, NR: 3Sheer dominance 🤌#PlayBold #TeamIndia #INDvSL pic.twitter.com/x2NucIDv7q
— Royal Challengers Bangalore (@RCBTweets) January 9, 2023