బెంగళూరు టెస్టులో భారత పేసర్లు అదరగొడుతున్నారు. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బుమ్రా, షమీ ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86/6 స్కోరుతో నిలిచిన ఆ జట్టు.. రెండో రోజు ఆట మొదలు పెట్టింది. బుమ్రా వేసిన తొలి ఓవర్లో డిక్కవెల్ల వరుసగా రెండు ఫోర్లు బాదాడు.
ఆ తర్వాత అశ్విన్ వేసిన ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఆ తర్వాత మళ్లీ బాల్ అందుకున్న బుమ్రా.. రెండో బంతికే లసిత్ ఎంబుల్డెనియా (1)ను పెవిలియన్ చేర్చాడు. బుమ్రా వేసిన షార్ట్ బంతిని పుల్ చేయడానికి ఎంబుల్డెనియా ప్రయత్నించాడు. కానీ మిస్సయ్యాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని పంత్ సునాయాసంగా అందుకున్నాడు.
దీంతో రెండో రోజు ఆటలో లంక తొలి వికెట్ కోల్పోయింది. ఈ ఓవర్లో ఒక్క పరుగే రావడంతో లంక జట్టు 96/7 స్కోరుతో నిలిచింది. భారత బౌలింగ్ ఇదే రేంజ్లో కొనసాగితే లంక జట్టు ఈ మ్యాచ్లో కూడా ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చేలా ఉంది.