IND vs SL : భారీ టార్గెట్ ఛేదనలో శ్రీలంక వెంట వెంటనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ప్రథుమ్ నిస్సంకా అర్షదీప్ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకు ముందు అక్షర్ పటేలో వేసిన ఓవర్లో ఓపెనర్ కుశాల్ మెండిస్ (23) అవుట్ అయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ క్యాచ్ పట్టడంతో మెండిస్ పెవిలియన్ బాట పట్టాడు. కుశాల్ మెండిస్, ప్రథుమ్ నిస్సంకా ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు వీళ్లిద్దరూ 44 పరుగులు జోడించారు. 5 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రీలంక వికెట్ నష్టపోయి 44 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 90 బంతుల్లో 185 చేయాలి. ప్రస్తుతం ధనంజయ డిసిల్వా 1, ఆవిష్క ఫెర్నాండో 0 తో క్రీజులో ఉన్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో 228 పరుగులు చేసింది. సూర్య 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీమిండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ 46, రాహుల్ త్రిపాఠి 35 పరుగులతో రాణించారు. చివర్లో అక్షర్ పటేల్(21) విధ్యంసం సృష్టించాడు.