IND vs SL | స్వదేశంలో భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ముందే ఆతిథ్య శ్రీలంకకు వరుస షాకులకు తాకుతున్నాయి. ఇదివరకే ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయం కారణంగా టీ20, వన్డే సిరీస్ నుంచి తప్పుకోగా తాజాగా ఆ జట్టు మరో ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారా సైతం ఎడమ చేతి గాయంతో దూరమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ జట్టు మేనేజర్ మహిందా హలంగొడ వెల్లడించాడు.
ఎడమ చేతి వేలిగాయంతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న తుషారా స్థానంలో లంకేయులు దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నారు. ఇక చమీర స్థానంలో అసితా ఫెర్నాండో జట్టుతో కలిశాడు. మరో రెండ్రోజుల్లో టీ20 మ్యాచ్‌లు మొదలుకానున్న నేపథ్యంలో వరుసగా ఫాస్ట్ బౌలర్లు ఇలా గాయాల బారిన పడుతుండటం లంక జట్టును కలవరపరుస్తోంది. దీంతో ప్రస్తుతం జట్టులో ఉన్న పేసర్లలో ఫెర్నాండొ, పతిరానలపై అధిక భారం పడనుంది.
Sri Lanka’s bowling unit has endured a horrendous 48 hours, with Nuwan Thushara joining Dushmantha Chameera on the injury list for the upcoming T20Is against India.
Dilshan Madushanka has been drafted into the squad.#SLvIND pic.twitter.com/0wV1Oz27Q5
— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) July 25, 2024
2022లో టీ20లలోకి ఎంట్రీ ఇచ్చిన తుషారా.. గత రెండేండ్ల కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టింది అతడే. కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్ వేదికగా ముగిసిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన (5/20)ను నమోదుచేశాడు. భారత్, శ్రీలంక మధ్య జూలై 27, 28, 30న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనున్న విషయం విదితమే. ఈ సిరీస్‌తోనే గౌతం గంభీర్ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా తన బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.
Fast bowler Dushmantha Chameera ruled out of Sri Lanka’s Asia Cup squad following an injury (on his left leg) during practices. Sri Lanka Cricket Selectors brought in Nuwan Thushara into the 20-man squad.
(Pic: Sri Lanka cricket) pic.twitter.com/dfJ6rarCUp
— ANI (@ANI) August 22, 2022